AP Chief Minister YS Jagan distributed Jagananna Vidya Kanuka kits to students at Adoni Municipal High School on Tuesday | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వతరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.8వతరగతిలోకి అడుగుపెడితే చాలు ప్రతి ఒక్కరికీ ఈ సెప్టెంబరు అంటే మరో రెండు నెలల్లోనే ఒక ట్యాబ్ కూడా ఇస్తున్నామని జగన్ తెలిపారు. దాని విలువ దాదాపు రూ.12వేలు అని అంచనా వేశామన్నారు. 4.70 లక్షల మంది పిల్లలు 8వతరగతిలోకి అడుగుపెట్టబోతున్నారని, ట్యాబ్ విలువ రూ.12 వేలు అంటే మరో రూ.500 కోట్లు పిల్లల భవిష్యత్ మీద ఖర్చు పెట్టబోతున్నామన్నారు.
#JaganannaVidyaKanuka
#apcmjagan
#VidyaKanukaSchoolkits